అమరావతిపై హై కోర్టులో పిటిషన్
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా రాష్ట్రప్రభుత్వాన్ని,సీఆర్డీఏను ఆదేశించాలని కోరుతూ రామారావు అనే రైతు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. జి.ఎన్.రావు కమిటీ జీవోను రద్దు చేయాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.