రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా...

రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా...


తాజాగా ఆంధ్రాలో రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే కదా. కేంద్రలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, రైతులకు ఎలాంటి నాణ్యత మైన విత్తనాలు పంచాలి అని సీఎం జగన్ అధికారులకు తెలియచేయడం జరిగింది. ఇంకా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా.. ఇతరా ఉత్పత్తుల ఆర్డర్‌ ఇవ్వడానికి డిజిటల్‌ కియోస్క్‌ ఏర్పాటు చేయాలని సీఎం తెలియయచేయడం జరిగింది.


 


ఇక విత్తనాల తయారీదారులు వద్ద నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని రైతు భరోసా కేంద్రాలకు పంపాలి అని తెలియచేయడం జరిగింది. ఇక మరో వైపు విత్తనాలు నిల్వ చేసే గోడౌన్లలో కూడా నాణ్యత పరీక్షలు నిర్వహించాలి అని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహించాలి తెలిపారు. ఇక ఆక్వాఫీడ్‌ నాణ్యతపై ఎలాంటి నియంత్రణ లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రవుదాం జరిగింది.


 


ఇందుకు సీఎం జగన్ సమాధానం తెలుపుతూ.. త్వరలోనే ఆక్వాఫీడ్‌ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ ఒక చట్టం తీసుకొని రావడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. ఇక సమావేశానికి ముందు డిజిటల్‌ కియోస్క్‌ను, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే భూసార పరీక్ష పరికరాలను అన్నిటి కూడా సీఎం వైఎస్‌ జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పరిశీలించడం జరిగింది.


 


ఇక అసలు విషయం ఐనా సీఎం ఆదేశాలు, సూచనలు వివరాలు తెలుసుకుందామా మరి..విత్తనాలు గోడౌన్లలో భద్ర పరిచినప్పుడు విత్తనాలు కల్తీ అవ్వకుండా సరైన నిల్వ పద్ధతులు పాటించండి అని తెలిపారు. ఇక గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు అందరు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే విధులు నిర్వహించాలి అని తెలియచేయడం జరిగింది. ఇక రైతులు పండించే పంటలకు బీమా సదుపాయం కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే పంపాలి అని తెలిపారు. ఇంకా రైతులకు పంటలు, సాగు విధానాలపై డిజిటల్‌ సమాచారాన్ని తెలపాలి అని అన్నారు.