ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు రామ రావణ రాజ్యం కాదట..!


ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు రామ రావణ రాజ్యం కాదట..!


బాహుబలి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందుతుండగా, ఇందులో ఒలివీయా , అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి నుండి చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టాలని జక్కన్న భావిస్తుండగా, సినిమాలోని పాత్రలని ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్టు సమాచారం. సినిమా మొదలైనప్పటి నుండి ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ అనే పేరుతోనే ప్రచారం జరుపుకుంటుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు భాషని బట్టి మారుతుందని తెలుస్తుంది. తెలుగులో రామ రావణ రాజ్యం అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగగా, ఇప్పుడు ఈ టైటిల్ ఆర్ఆర్ఆర్‌కి పెట్టే ఛాన్స్ లేదు. అందుకు కారణం వి3 ఫిలింస్ అనే సంస్థ రామ రావణ రాజ్యం అనే టైటిల్‌ని చాంబర్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుందట. ఆర్ఆర్ఆర్ చిత్రం రామ రౌద్ర రుషితం అనే పేరుతోను ప్రచారం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.